బాహుబలి-2 ట్రైలర్ సరికొత్త రికార్డ్..!

బాహుబలి బిగినింగ్ అయినా సినిమా రిలీజ్ తర్వాత రికార్డులను క్రియేట్ చేసింది కాని అదే పార్ట్-2 ట్రైలర్ నుండి సంచలనంగా మారింది. కేవలం 24 గంటల్లో 2 కోట్ల వ్యూయర్ షిప్ రాబట్టింది బాహుబలి-2 ట్రైలర్. కన్నుల పండుగగా రెండున్నర సినిమాల్లోనే సినిమా కథ మొత్తం చెప్పేసిన రాజమౌళి సినిమా కోసం అందరు ఈగర్ గా వెయిట్ చేసేలా చేశాడు.    

అంచనాలను మించి ట్రైలర్ ఉండటంతో సినిమా మీద ఇంకా హోప్స్ పెరిగాయి. ప్రభాస్ వీరత్వం.. రానా పగ.. దేవసేన అందం.. శివగామి మాతృత్వం ఇవన్ని ట్రైలర్ కు ఓ సెపరేట్ క్రేజ్ తీసుకొచ్చాయి. సినిమా ట్రైలర్ రికార్డులను క్రియేట్ చేస్తున్న బాహుబలి-2 రిలీజ్ తర్వాత ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త సంచలనాలు సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు.