ఫస్ట్ లుక్ ఆరోజే.. మహేష్ తేల్చేశాడు..!

సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో సినిమా ఫస్ట్ లుక్ ఫైనల్ డేట్ వచ్చేసింది. అందరు అనుకున్నట్టుగానే ఉగాదికి మహేష్ సినిమా ఫస్ట్ లుక్ వస్తుందట. ఇది ఎవరో చెప్పింది కాదు స్వయంగా మహేష్ బాబే ఎనౌన్స్ చేశాడు. రీసెంట్ గా యప్ టివి ఒర్జినల్స్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ తన సినిమా ఫస్ట్ లుక్ మే బి ఉగాదికి రావొచ్చని అన్నాడు.

లాస్ట్ ఇయర్ ఎప్పుడో స్టార్ట్ అయిన మురుగదాస్ సినిమా ఎన్ని పండుగలొచ్చినా సరే కనీసం టైటిల్ పోస్టర్ కూడా లీక్ చేయలేదు. దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా పని చేస్తున్న ఈ సినిమా కచ్చితంగా కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని అంటున్నారు. తెలుగు తమిళా భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ లు నిర్మిస్తున్నారు.