
యువ హీరోల్లో శర్వానంద్ స్టైలే వేరు.. చేసే ప్రతి సినిమా సరికొత్త పంథాలో ఉండాలని కోరుకునే శర్వానంద్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఈ సంక్రాంతికే శతమానం భవతి అంటూ వచ్చి హిట్ అందుకున్న శర్వానంద్ త్వరలో రాధ సినిమాతో రాబోతున్నాడు. చంద్రమోహన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను బివిఎసెన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
అసలైతే ఈ నెల 29న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన శర్వానంద్ మళ్లీ ఆ డేట్ ను పోస్ట్ పోన్ చేశారని తెలుస్తుంది. మార్చి 24న కాటమరాయుడు రిలీజ్ అవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాతో పోటీ పడే ధైర్యం చేసినా సెన్సార్ రిపోర్ట్ లో పవన్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో శర్వానంద్ సినిమా పోస్ట్ పోన్ చేశారట. పవర్ స్టార్ స్టామినా ముందు శర్వానంద్ తలవంచక తప్పలేదు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో పోలీస్ క్యారక్టర్ లో కనిపిస్తున్నాడు శర్వానంద్.