అమరేంద్ర బాహుబలి అను నేను.. జయహో బాహుబలి-2.. ట్రైలర్ రిలీజ్..!

ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అవుతున్న బాహుబలి-2 ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ చాటుతూ మరోసారి రోమాలు నిక్కబొడుచుకునేలా ఈ ట్రైలర్ ఉంది. అమరేంద్ర బాహుబలి అను నేను.. అంటూ రాజుగా ప్రజల సాక్షిగా ప్రమాణం చేస్తున్న రాజు.. ఇంతలోనే శివగామి అంతర్ యుద్ధం ప్రకటించడం.. వారెవా ట్రైలర్ అంటే ఇలా ఉండాలి అన్న రేంజ్ లో కట్ చేయించాడు రాజమౌళి. 

బాహుబలి బిజింగ్ లో వచ్చిన ప్రశ్నలన్నిటికి ఈ సెకండ్ పార్ట్ సమాధానాం చెబుతుంది. ట్రైలర్ చూస్తే సినిమా వెంటనే చూడాలన్న ఎక్సయిటింగ్ కలుగక మానదు. ఏప్రిల్ 28న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ అంచనాలను ఇంకా పెంచేసింది. ప్రభాస్ రానాల ఫైట్ పీక్స్ లో ఉంటుందని రెండు నిమిషాల ట్రైలర్ లోనే చూపించేశాడు రాజమౌళి. ట్రైలర్ అనుకున్న రేంజ్ లో ఉంది మరి సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.