పవర్ స్టార్ గెస్ట్ గా మెగాస్టార్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా మార్చి 24న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాను డాలి డైరెక్ట్ చేయగా శరత్ మరార్ నిర్మించారు. మెగా ట్రెండ్ ప్రకారంగా సినిమా ఆడియోని  డైరెక్ట్ గా మార్కెట్ లో రిలీజ్ చేసిన కాటమరాయుడు టీం. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 18న జరుపనున్నారు.  

ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవిని చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేశారట. చిరు కూడా ఈవెంట్ కు వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు టాక్. మెగాస్టార్ పవర్ స్టార్ ఒకే వేదిక మీద కనబడితే ఫ్యాన్స్ హుశారు ఏ రేంజ్లో ఉంటుందో చెప్పొచ్చు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన కాటమరాయుడు సాంగ్ శ్రోతలను అలరిస్తున్నాయి. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన కాటమరాయుడు సినిమా కచ్చితంగా పవర్ స్టార్ కు మరో సూపర్ హిట్ ఇస్తుందని నమ్ముతున్నారు.