
స్టార్ హీరో కమర్షియల్ ఫార్ములా సినిమా అంటే అందులో కచ్చితంగా సూపర్ హాట్ ఐటం సాంగ్ ఉండాల్సిందే. ఇక తనయుడిని హీరోగా నిలబెట్టే క్రమంలో బెల్లంకొండ సురేష్ ఇలాంటి కమర్షియల్ ఫార్ములానే ఫాలో అవుతున్నాడు. బెల్లంకొండ శ్రీను నటించిన రెండు సినిమాలలో తమన్నాతో ఐటం సాంగ్ చేయగా ఇప్పుడు బోయపాటి శ్రీను సినిమాలో కూడా అలాంటి ఓ ఐటం ప్లాన్ చేస్తున్నారట.
ఈ సాంగ్ కోసం కేథరిన్ త్రేసాను సెలెక్ట్ చేసినట్టు టాక్.. తన హాట్ లుక్స్ తో క్రేజ్ ను సంపాదించిన కేథరిన్ కెరియర్ లో మొదటిసారి ఐటం సాంగ్ చేయబోతుంది. ఈ సాంగ్ కోసం అమ్మడికి బాగానే ముట్టచెబుతున్నారట. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కేథరిన్ ఐటం సాంగ్ అదిరిపోయేలా ఉంటుందట. వరుసగా క్రేజీ భామలతో రొమాన్స్ చేస్తున్న బెల్లంకొండ శ్రీను అనుకున్న స్టార్ ఇమేజ్ సంపాదిస్తాడో లేదో చూడాలి.