
తెలంగాణా చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా హీరోయిన్ సమంత భాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చేనేత కార్మికులను కలుసుకుంటున్నారు. మొదటిసారి సిరిసిల్లలోని చేనేత కార్మికులను కలిసిన సమంత జనగామ జిల్లాలోని గుండాల చేనేత కార్మికులను కలుసుకున్నారు. టెక్నాలజీ అప్డేట్ అవుతుండటంతో వాటికి అనుగుణంగా చేనేత వస్త్రాలు ఉండేలా చూసుకోవాలని సూచన ఇచ్చారు.
అంతేకాదు రానున్న రోజుల్లో చేనేత వస్త్రాలకు మంచి డిమాండ్ ఏర్పడుతుందని అన్నారు. చేనేత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్న సమంత రాకతో గుండాల ప్రాతమంతా సందడి సందడిగా మారింది. తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా సమంత రాష్ట్రమంతా చుట్టేస్తుంది. ఏ పని చేసినా పర్ఫెక్ట్ చేసే శ్యామ్స్ చేనేత కార్మికులను ఉత్సాహం నింపే మాటలతో వారిలో నమ్మకాన్ని పెరిగేలా చేస్తుంది.