
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కాటమరాయుడు మార్చి 24న రిలీజ్ కు సిద్ధమయ్యింది. ఈరోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా సెన్సార్ వారి నుండి క్లీన్ 'యు' సర్టిఫికెట్ అందుకుంది. గోపాల గోపాల దర్శకుడు డాలి డైరెక్ట్ చేసిన ఈ కాటమరాయుడు టీజర్ సినిమా మీద అంచనాలను పెంచేసింది. ఇక పోస్టర్స్ లో పవర్ స్టార్ లుక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
సర్దార్ గబ్బర్ సింగ్ తో నిరాశ పరచిన పవర్ స్టార్ కాటమరాయుడితో కచ్చితంగా రికార్డులు బద్ధలు కొట్టడం ఖాయమని అంటున్నారు. ఇక సినిమా సెన్సార్ నుండి వచ్చిన టాక్ బట్టి చూస్తే ఇదో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అని.. ఫైట్స్ కూడా చాలా తక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక సెంటిమెంట్ సీన్స్ అయితే సినిమాలో చాలా ఉన్నాయట. కాటమరాయుడు తమ్ముళ్లుగా శివబాలాజి, విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో పవర్ స్టార్ కు జోడిగా శృతి హాసన్ నటించింది.