బాబు బాగా బిజీ టీజర్.. అదెప్పుడో పదిహేనేళ్ల క్రితం..!

బాలీవుడ్ అడల్ట్ మూవీ హంటర్ మూవీ రీమేక్ గా తెలుగులో వస్తున్న సినిమా బాబు బాగా బిజీ. అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మిస్తి చక్రవర్తి, శ్రీముఖి, తేజశ్వి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో త్వరలో రిలీజ్ అవుతుంది. కొద్ది గంటల క్రితం ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ తోనే సినిమాలో కంటెంట్ ఎంత హాట్ గా ఉంటుందో చూపించాడు దర్శకుడు నవీన్.

అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామ నిర్మిస్తున్న ఈ సినిమా నుండి రీసెంట్ గా రిలీజ్ అయిన పోస్టర్స్ కూడా అందరికి షాక్ ఇచ్చాయి. పోస్టర్స్ తోనే సంచలనం సృష్టించిన ఈ సినిమా టీజర్ ఇంకాస్త క్రేజీగా తయారైంది. సినిమాలో అవసరాల డైలాగ్ అదెప్పుడో పదిహేనేళ్ల క్రితం అంటూ చెబుతాడు. మరి అతను చెప్పిన డైలాగ్ ఎలాంటి సందర్భమో అర్ధం చేసుకోవచ్చు. 

టీజర్ రెస్పాన్స్ బాగానే ఉంది. తెలుగులో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ మంచి జోష్ లో ఉన్న అవసరాల శ్రీనివాస్ హీరోగా చేస్తున్న తొలి ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క దర్శకుడిగా కూడా తన ప్రతిభ చాటుతున్నాడు అవసరాల శ్రీనివాస్.