
సూపర్ స్టార్ మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన అతడు, మహేష్ ఖలేజా సినిమాలు మంచి ప్రేక్షకాదరణ పొందనివని తెలిసిందే. ఇక ఇవే కాకుండా త్వరలో మరో సినిమాకు ఈ ఇద్దరు రెడీ అవుతున్నారు. అంతకుముందే త్రివిక్రం మహేష్ ను డైరెక్ట్ చేయబోతున్నాడట. అదెలా అంటే టాలీవుడ్ స్టార్ ఇమేజ్ తో పాటుగా యాడ్స్ లో కూడా మహేష్ స్టామినా ఏంటో తెలిసిందే.
సౌత్ లో హయ్యెస్ట్ యాడ్స్ కలిగిన హీరోగా క్రేజ్ సంపాదించిన మహేష్ ఎకౌంట్ లో ప్రముఖ ఎయిర్ కూలర్ కంపెనీ లాయిడ్ కూడా చేరింది. ఇక దీని కోసం మహేష్ ను డైరెక్ట్ చేయనున్నాడట త్రివిక్రం శ్రీనివాస్. ప్రస్తుతం మురుగదాస్ సినిమా షూటింగ్ లో ఉన్న మహేష్ ఈ యాడ్ కోసం త్రివిక్రంతో షూట్ లో పాల్గొననున్నాడు. మరో పక్క త్రివిక్రం కూడా పవర్ స్టార్ తో సినిమాకు సిద్ధమవుతున్నాడు.