
రచయితగా సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగించిన వక్కంతం వంశీ త్వరలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు. వంశీ డెబ్యూ మూవీగా రాబోతున్న ఈ సినిమా టైటిల్ 'నా పేరు సూర్య'. లగడపాటి శిరీష్ శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్.
దేశభక్తికి చెందిన ఈ కథలో కథను టర్న్ తిప్పే ఓ క్యారక్టర్ సినిమాలో ఉందట. ఆ పాత్రకు మెగాస్టార్ అయితే బాగుంటాడని వక్కంతం అభిప్రాయపడ్డాడట.. ఇప్పటికే వంశీ చిరుకి కథను కూడా వినిపించాడని తెలుస్తుంది. మెగాస్టార్ దగ్గర నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదట. చిరు ఓకే అంటే ఈ సినిమాకు స్పెషల్ క్రేజ్ వచ్చినట్టే. మెగా హీరోల్లో సూపర్ ఫాంలో ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరక్షన్ లో దువ్వాడ జగన్నాధం సినిమా చేస్తున్నాడు. మేలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.