
స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు ఇప్పుడు తమ సినిమాల మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. చిరు రీ ఎంట్రీ మూవీ ఖైది నంబర్ 150 సక్సెస్ అయ్యిందో లేదో వెంటనే మరో సినిమాకు లైన్ చేశాడు. ఇక బాలయ్య కూడా 100వ సినిమా శాతకర్ణి హిట్ అవగానే పూరితో సినిమా చేస్తున్నాడు. పవర్ స్టార్ ఏకంగా మూడు సినిమాలకు ముహుర్తం పెట్టేశాడు.
ఎప్పుడు లేనిది ఈ ముగ్గురు ఒకేసారి ఇలా వరుసగా సినిమాలు చేయడానికి కారణం 2019 ఎన్నికలని మీడియా రచ్చ చేయడం మొదలు పెట్టింది. బాలయ్య ఆల్రెడీ లీడింగ్ ఎమ్మెల్యే.. పవర్ స్టార్ ఈసారి జనసేనతో రంగంలో దిగుతున్నాడు. మెగాస్టార్ ఆల్రెడీ కాంగ్రెస్ లో ఉన్నారు ఇలా ఈ ముగ్గురు 2019 ఎన్నికల సమయంలో బిజీగా ఉంటారు కాబట్టి ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నారని అంటున్నారు. అయితే దీని పట్ల పరిశ్రమ పెద్దగా స్పందించాడు తమ్మారెడ్డి భరద్వాజ. చిరు బాలయ్య పవన్ లు వరుసగా సినిమాలు చేయడం పరిశ్రమకే మంచిదని.. రాజకీయాలు సినిమాలు రెండు చేసే అవకాశం ఉందని అన్నారు.
ఓ వర్గం మీడియా చిరు బాలయ్య పవన్ కళ్యాణ్ లు చేస్తున్న వరుస సినిమాలను తప్పుగా చెప్పుకొస్తుందని.. వాళ్లు అలా చేస్తే తప్పేం లేదని అన్నారు. ఇక వీరితో పాటుగా మిగతా స్టార్ హీరోలు కూడా సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేస్తే మంచిదని అభిప్రాయపడ్డారు తమ్మారెడ్డి.