అఖిల్ సినిమాకు వెరైటీ టైటిల్..!

అక్కినేని అఖిల్ సెకండ్ మూవీ ఏప్రిల్ 1న సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తుంది. విక్రం కె కుమార్ డైరక్షన్ లో అఖిల్ రెండో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నపూర్ణ బ్యానర్లో నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు 40 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్న ఈ సినిమా టైటిల్ గా జున్ను అని పెట్టబోతున్నారట. విక్రం కుమార్ టైటిల్స్ అన్ని విచిత్రంగా ఉంటాయి.. 13, ఇష్క్, మనం, 24 ఇలా కథకు తగ్గ టైటిల్ ను పెడుతూ క్రేజ్ తెచ్చుకున్నాడు.

అంతేకాదు మంచి అభిరుచి గల దర్శకుడు అన్న పేరు కూడా సంపాదించాడు. ఇక బయటకు వచ్చిన జున్ను టైటిల్ చూస్తే ఎంత వెరైటీగా ఉందో సినిమా కూడా అంతే కొత్తగా ఉండేలా జాగ్రత్త పడుతున్నాడట విక్రం. ఓ పట్టానా నచ్చని అఖిల్ ను కూడా కన్విన్స్ చేసి మెప్పించాడంటే విక్రం ఈసారి కూడా బలమైన కథనే రాసి ఉంటాడని అంటున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్తున్న ఈ సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ అఫిషియల్ గా వెళ్లడించనున్నారు చిత్రయూనిట్.