
మోడల్ గా కెరియర్ ప్రారంభించిన పూజా హెగ్దే కోలీవుడ్ మాస్క్ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగులో ముకుంద, ఒక లైలా కోసం సినిమాల్లో నటించిన అమ్మడు లక్కీగా బాలీవుడ్ హృతిక్ సరసన మొహెంజోదారోలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ కాకపోయే సరికి బాలీవుడ్ నుండి మళ్లీ టాలీవుడ్ బాట పట్టింది పూజా. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం సినిమాలో బన్ని సరసన నటిస్తున్న పూజా హెగ్దే మరోసారి తనవైపు అందరి దృష్టి పడేలా హాట్ ఫోటో షూట్ ఇచ్చింది.
మ్యాక్సిం మేగజైన్ కవర్ పేజ్ ను ఆక్రమించిన అమ్మడు చూపరులను ఆకట్టుకుంటుంది. హాట్ అప్పీల్ తో స్కిన్ షో చేస్తున్న పూజా హెగ్దే ప్రేక్షకులను బుట్టలో వేసుకునే ప్రయత్నాలు చేస్తుంది. తెలుగులో చేసిన సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా సరే ఆమెకు ఊహించని రేంజ్లో క్రేజ్ వచ్చింది. ఇక బన్నితో నటించే డిజెతో ఆమె స్టార్ ఇమేజ్ వచ్చేసినట్టే. టీజర్ లో కనిపించిన కొద్దిసేపైనా తన మార్క్ హాట్ షోతో అదరగొట్టిన పూజా ఫోటో షూట్ లు చేయాలంటే తన తర్వాతే అన్నట్టుగా రెచ్చిపోతుంది.