
కుర్ర హీరోల్లో తనకంటూ సెపరేట్ ఇమేజ్ ఏర్పరచుకున్నాడు నాగ శౌర్య. లాస్ట్ ఇయర్ రెండు హిట్లు రెండు ఫ్లాపులతో అలరించిన నాగశౌర్య ప్రస్తుతం నూతన దర్శకుడు సుందర్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు టైటిల్ గా అమ్మమ్మగారిల్లు అని పెట్టబోతున్నారట. సినిమాకు ఇలాంటి సాఫ్ట్ టైటిల్ పెట్టారు అంటే మాత్రం కచ్చితంగా కంటెంట్ వైజ్ పకడ్బందీగా ఉంటుందని తెలుస్తుంది.
మాన్లీ లుక్స్ తో మంచి నటుడిగా కూడా గుర్తింపు తెచ్చుకుంటున్న నాగశౌర్య అమ్మమ్మగారిట్లో ఏం చేస్తాడో చూడాలి. సినిమాలో సమంత హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. సొంతంగా ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసిన నాగ శౌర్య మరో పక్క నిర్మాతగా కూడా బిజీ అవుతున్నాడు. మరి శౌర్య చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. కుర్ర హీరోల మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడ్డ ఈ సమయంలో ఎవరికి వారు తమ సత్తా చాటేలా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. మరి శౌర్య చేస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.