శాటిలైట్ రేటు అదిరిపోయింది..!

సూపర్ స్టార్ రజినికాంత్ ను మరోసారి రోబోగా చూపిస్తున్నాడు శంకర్.. రోబో సీక్వల్ గా వస్తున్న 2.0గా వస్తున్న సినిమా 400 కోట్ల అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమవుతుంది. హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో సినిమా వస్తుందని అంటున్నారు. ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఫుల్ జోష్ లో నడుస్తుంది. కేవలం శాటిలైట్ రైట్సే భారీ రేంజ్లో అమ్ముడయ్యాయి. 

జీ టివి తెలుగు తమిళ హింది రైట్స్ మొత్తం కలిపి ఏకంగా 110 కోట్ల భారీ మొత్తంగా కొనేశారట. బడ్జెట్ లో పావు వంతు శాటిలైట్ ద్వారా రాబట్టేసింది 2.0 మూవీ. హై స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా భారీ రేంజ్లో అమ్ముడవుతుందని తెల్లుస్తుంది. అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రజిని మూడు పాత్రల్లో నటిస్తాడని తెలుస్తుంది. రోబో మొదటి పార్ట్ లో వశీకర్, రోబోలుగా కనిపించిన రజిని 2.0లో త్రిపుల్ రోల్ చేస్తున్నాడట. అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా మీద బాలీవుడ్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.