యూట్యూబ్ హీరోయిన్ లక్కీ ఛాన్స్..!

యూట్యూబ్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ సంపాదించిన చాందిని చౌదరి సిల్వర్ స్క్రీన్ మీద హిట్ కొట్టలేదు. మహేష్ బాబు బ్రహ్మోత్సవంలో తళుక్కున మెరిసిన చాందిని హీరోయిన్ గా కేటుగాడు, కుందనపు బొమ్మ సినిమాల్లో నటించినా లాభం లేకుండా పోయింది. ప్రస్తుతం ఫణింద్ర డైరక్షన్ లో వస్తున్న సినిమాలో ఛాన్స్ కొట్టేసిన చాందిని భలే మంచి రోజు డైరక్టర్ శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో మూవీలో కూడా నటిస్తుందట.

శమంతకమణి అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు, నారా రోహిత్, సందీప్ కిషన్, ఆది హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆదికి పెయిర్ గా నటిస్తుందట చాందిని. యూట్యూబ్ హీరోయిన్ గా క్రేజీ ఫ్యాన్స్ ను ఏర్పరచుకున్న చాందిని సిల్వర్ స్క్రీన్ మీద సక్సెస్ కోసం ఎదురుచూస్తుంది. తనతో పాటు యూట్యూబ్ హీరోగా చేసిన రాజ్ తరుణ్ కెరియర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తుంటే చాందిని మాత్రం ఇంకా సిల్వర్ స్క్రీన్ పై హిట్ కొట్టలేదు. మరి రాబోతున్న ఈ శమంతకమణితో అయినా అమ్మడు హిట్ అందుకుంటుందేమో చూడాలి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా భవ్య ఆర్ట్ క్రియేషన్స్ లో నిర్మితమవుతుంది.