రోగ్ ఆడియోలో సన్ని సెన్సేషన్..!

ప్రస్తుతం దేశం మొత్తం సన్ని లియోన్ మాయలో ఉందంటే నమ్మాల్సిందే.. పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ హాట్ స్టార్ గా సన్ని సూపర్ క్రేజ్ సంపాదించింది. అందుకే గూగుల్ సెర్చ్ లో టాప్ ప్లేస్ లో రెండు సార్లు నిలిచింది అమ్మడు. ఇండియన్ స్క్రీన్ మీద తన అందాలతో అలరిస్తున్న సన్ని ఓ తెలుగు సినిమా ఆడియోలో చిందులు వేయడం క్రేజీగా మారింది.

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాధ్ డైరక్షన్ లో వస్తున్న రోగ్ ఆడియోలో సన్ని లియోన్ హాట్ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హైదరాబాద్ లో జరిగిన ఈ ఆడియోలో రకరకాల డ్రెస్సులతో అలరించింది అమ్మడు. ప్రొగ్రాంకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవడమే కాదు ఆడియో రేంజ్ కూడా పెంచేసింది అమ్మడు. సన్ని డ్యాన్స్ తో సెన్సేషనల్ గా మారిన రోగ్ ఆడియో అందరి దృష్టిని ఆకర్షించింది. 

ఇషాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మన్నారా చోప్రా, ఏంజిలా హీరోయిన్స్ గా నటించారు. వరుస ఫ్లాపుల్లో పూరి రోగ్ తో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. మరి రోగ్ పూరి ఆశలను నెరవేరుస్తుందో లేదో చూడాలి.