సంబంధిత వార్తలు

మహేశ్‌బాబు, కాజల్ అగర్వాల్, సమంత ప్రధాన పాత్రలుగా రూపొందిన చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ చిత్రంలోని ‘వచ్చింది కదా అవకాశం.. ఓ మంచి మాట అనుకుందాం’.. అనే పాట లిరికల్ వీడియోను చిత్ర బృందం మంగళవారం విడుదల చేసింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ పాటకు సాహిత్యమందించగా, అభయ్ జోద్పూరకర్ పాడాడు. ఇటీవలే ఈ చిత్రంలోని మధురం.. మధురం పాట టీజర్‌ను విడుదల చేశారు. ఈనెల 7వ తేదీన ఈ చిత్ర ఆడియో విడుదల కానుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ వి. పొట్లూరి, మహేశ్‌బాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీత బాణీలు సమకూర్చారు.