
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డాలి డైరక్షన్ లో చేస్తున్న కాటమరాయుడు ఈ నెల 24న రిలీజ్ అవుతుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. సినిమాలోని మొదటి సాంగ్ మిరా మిరా మీసం యూట్యూబ్ లో సంచలనాలను సృష్టించింది. ఇక అదే సినిమా నుండి లాగే లాగే సాంగ్ రిలీజ్ అయ్యి మంచి ఫీడ్ బ్యాక్ అందుకోగా తాజాగా కొద్ది గంటల క్రితం జివ్వు జివ్వు సాంగ్ రిలీజ్ చేశారు.
అనూప్ అదరగొట్టే మ్యూజిక్ తో వచ్చిన ఈ సాంగ్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో పవర్ స్టార్ లుక్ క్రేజీగా మారింది. సర్దార్ గబ్బర్ సింగ్ అనుకున్న రేంజ్ సక్సెస్ కాకపోవడంతో రాబోతున్న కాటమరాయుడుతో మరోసారి బాక్సాఫీస్ షేక్ చేయాలని చూస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తో శృతి హాసన్ రొమాన్స్ చేస్తున్న ఈ సినిమాను శరత్ మరార్ నిర్మిస్తున్నారు. మాస్ ఆడియెన్స్ ను అలరించేలా ఉన్న ఈ సాంగ్ పిక్చరైజ్ తో మరింత ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు.