
జనతా గ్యారేజ్ హిట్ తర్వాత ఎన్టీఆర్ ఆలోచనల్లో చాలా మార్పులొచ్చాయి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ప్రేక్షకులు తన నుండి కోరుకునే అన్ని అంశాలు ఉండేలా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే బాబి డైరక్షన్ లో ప్రస్తుతం చేస్తున్న సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడట. మూడు విభిన్న పాత్రల్లో జూనియర్ కనిపించనున్నాడని తెలుస్తుంది.
ఇక సినిమాలో హీరోయిన్స్ గా రాశి ఖన్నా, నివేదా థామస్ సెలెక్ట్ అవగా మరో హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టారు. అంతేకాదు సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా రకుల్ తో ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారట చిత్రయూనిట్. జనతా గ్యారేజ్ లో పక్క లోకల్ సాంగ్ తో సూపర్ క్రేజ్ దక్కించుకోగా మరోసారి అలాంటి స్టార్ ఐటంతో రావాలని చూస్తున్నాడు తారక్. కాజల్ ను ఎలాగు పక్కా లోకల్ అమ్మాయిగా చూపించిన జూనియర్ ఇప్పుడు రకుల్ ను కూడా ఐటం గాళ్ చేయబోతున్నాడు. క్రేజీ సినిమాలతో వరుస ఆఫర్లు చేజిక్కించుకుంటున్న రకుల్ ఐటం గా చేస్తుందా లేదా అన్నది పక్కనపెడితే ఒకవేళ రెమ్యునరేషన్ ఆశ చూపి చేయిస్తే కనుక సినిమాలో ఈ సాంగ్ ప్రత్యేకతను ఏర్పరచుకుంటుందని చెప్పొచ్చు.