
మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ తెలుగులో నటించిన రెండు సినిమాలకే సూపర్ క్రేజ్ సంపాదించింది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో నేను శైలజ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ సినిమా హిట్ అవడంతో పాపులారిటీ సంపాదించగా రీసెంట్ గా వచ్చిన నాని నేను లోకల్ తో కూడా సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన కీర్తి సురేష్ త్రివిక్రం శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సినిమాలో కూడా సెలెక్ట్ అయ్యిందని అంటున్నారు.
ఇదే కాకుండా బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ డైరక్షన్ లో వస్తున్న సినిమాలో కూడా కీర్తి సురేష్ ఫైనల్ అయినట్టు ఫిల్మ్ నగర్ టాక్. హీరోయిన్స్ ను డబ్బుతో కొనేస్తున్న బెల్లంకొండ హీరో కీర్తిని కూడా అలానే ఓకే చేశారట. ప్రస్తుతం అర కోటి మాత్రమే డిమాండ్ చేస్తున్న అమ్మడికి ఏకంగా కోటి ఇస్తామని ఈ సినిమాకు బుక్ చేసుకున్నారట.
ఈ లెక్కన చూస్తే కీర్తి కూడా కోటి హీరోయిన్ అయినట్టే. ఎలాగు స్టార్ క్రేజ్ వచ్చింది కాబట్టి కీర్తి కోటి ఇచ్చి మరి ఆమెను సెలెక్ట్ చేయడం ఖాయం. ఇప్పటికే మహేష్ అల్లు అర్జున్ రానున్న సినిమాల్లో కూడా కీర్తిని అడుగుతున్నారని తెలుస్తుంది.