
టాలీవుడ్ క్రేజీ డైరక్టర్స్ లో క్రిష్ కూడా ఒకరని చెప్పాల్సిందే. శాతకర్ణి సినిమాతో ఈ డైరక్టర్ ప్రతిభ ఏంటో ప్రూవ్ అయ్యింది. బాలయ్య ల్యాండ్ మార్క్ సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి ఆ రేంజ్ సక్సెస్ అవడానికి క్రిష్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. అందుకే టాప్ డైరక్టర్స్ లిస్ట్ లో క్రిష్ కూడా చేరాడు. ప్రస్తుతం తన తర్వాత సినిమా ప్లానింగ్ లో ఉన్న క్రిష్ వెంకటేష్ తో సినిమా తీయాలని ప్రయత్నించాడు కాని కుదరలేదు.
ఇక ఈమధ్యనే మెగాస్టార్ చిరంజీవికి ఓ కథ వినిపించాడట.. కథ విన్న చిరు ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తుంది. చెర్రి సపోర్ట్ తోనే మెగాస్టార్ కు స్టోరీ చెప్పాడట క్రిష్. క్రిష్ సినిమాలన్ని వేటికవి ప్రత్యేకంగా ఉంటాయి. కచ్చితంగా చిరంజీవి కోసం ఓ పవర్ ఫుల్ కథే సిద్ధం చేసి ఉండొచ్చని అంటున్నారు. ఓ పక్క చిరు తన 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ చేస్తున్నాడు.
ఆ సినిమా పూర్తి అయ్యక క్రిష్ డైరక్షన్ లో సినిమా చేసే ఛాన్సెస్ ఉన్నాయట. శాతకర్ణి హిట్ అయిన తర్వాత క్రిష్ వెంటనే సినిమా చేయకుండా కాస్త ఆలోచనలో పడ్డాడు. కెరియర్ లో కమర్షియల్ హిట్ అందుకున్న క్రిష్ ఇక నుండి తన సినిమాలన్ని ఇదే రేంజ్ హిట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట. మరి అనుకున్నట్టుగా మెగాస్టార్ తో సినిమా తీస్తాడా లేక మరో ప్రయత్నం ఏదైనా చేస్తాడా అన్నది చూడాలి.