
శాతకర్ణి తర్వాత నందమూరి నటసింహం బాలయ్య బాబు నటిస్తున్న సినిమా డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాధ్ డైరక్షన్ లో వస్తుంది. రీసెంట్ గా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా ఎంతో ప్రెస్టిజియస్ గా తెరకెక్కిస్తున్నాడు పూరి. ఇక పూరి సినిమాలో హీరోలెంత పవర్ ఫుల్ గా ఉంటారో విలన్లు కూడా అదే రేంజ్లో ఉంటారు.
ఈ సినిమాలో విలన్ గా ఘట్టమనేని అల్లుడు యువ హీరో సుధీర్ బాబు నటిస్తున్నాడని టాక్. హీరోగా సక్సెస్ అయ్యి వైవిధ్యమైన సినిమాలు చేస్తున్న సుధీర్ బాబు ఇప్పటికే బాలీవుడ్ లో విలన్ గా ట్రై చేసి సక్సెస్ అయ్యాడు. సుధీర్ బాబు విలన్ గా నటించిన సినిమా బాఘి మూవీలో తన వరకు సూపర్ ఎనర్జీ కనబరచాడు. ఆ ఎనర్జీ చూసే పూరి బాలయ్యకు విలన్ గా సెలెక్ట్ చేశాడట. మరి బాలయ్యతో డైరెక్ట్ ఫైట్ కు దిగుతున్న సుధీర్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.