
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి డైరక్షన్ లో వస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ నెల 15 నుండి తారక్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. సినిమా షెడ్యూల్ అంతా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్న చిత్రయూనిట్ హీరోయిన్స్ విషయంలో మాత్రం ఇంకా ఫైనల్ డెశిషన్ తీసుకోలేదట. ముగ్గురు హీరోయిన్స్ అవసరం ఉండగా ఈ సినిమాలో రాశి ఖన్నా ఓ హీరోయిన్ అవగా మరో హీరోయిన్ గా నివేదా థామస్ ను సెలెక్ట్ చేశారట.
ఇక థర్డ్ హీరోయిన్ గా మాత్రం ఓ స్టార్ హీరోయిన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఆమె ఎవరు అన్నది ఇంకా బయటకు రాలేదు కాని తారక్ మాత్రం ఓ స్టార్ హీరోయిన్ తో రొమాన్స్ చేస్తాడని అంటున్నారు. ఇప్పటికే సౌత్ లో ఉన్న సూపర్ స్టార్ హీరోయిన్స్ అందరితో జతకట్టిన తారక్ వారిలో మళ్లీ ఎవరితో రిపీట్ రొమాన్స్ చేస్తాడో చూడాలి.
ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడట. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి చేసుకోగా సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడట దేవి.