డ్యుయల్ రోల్ లో బిచ్చగాడు..!

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని బిచ్చగాడు సినిమాతో తెలుగులో కూడా సూపర్ ఇమేజ్ సంపాదించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన బిచ్చగాడు ఏకంగా వంద రోజులు జరుపుకుంది అంటే రికార్డ్ అన్నట్టే. ఆ తర్వాత వచ్చిన బేతాళుడు పర్వాలేదు అనిపించుకోగా రీసెంట్ గా వచ్చిన యమన్ మాత్రం తెలుగులో ఫ్లాప్ అయ్యింది.  

ఇక్కడ రిజల్ట్ ఎలా ఉన్నా యమన్ తమిళంలో క్రేజీ కలక్షన్స్ రాబట్టింది. ఏకంగా సూపర్ స్టార్ రజినికాంత్ యమన్ సినిమా గురించి ప్రస్థావించాడంటే విజయ్ యమన్ అక్కడ సూపర్ సక్సెస్ అయినట్టే. ఇక తెలుగు తమిళంలో ఏర్పడ్డ మార్కెట్ దృష్టిలో ఉంచుకుని ఈసారి తెలుగు తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీ చేస్తున్నాడట విజయ్ ఆంటోని.  

రాబోతున్న ఈ సినిమాలో విజయ్ డ్యుయల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. డబ్బింగ్ సినిమాలతోనే ఇంతటి ఇమేజ్ సంపాదించుకున్న విజయ్ డైరెక్ట్ తెలుగు సినిమా అంటే కచ్చితంగా సక్సెస్ అందుకుంటాడని అంటున్నారు. మరి విజయ్ నటించే ఈ సినిమా డీటేల్స్ త్వరలో తెలుస్తాయి.