మహేష్ మళ్లీ హ్యాండ్ ఇచ్చాడు..!

సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా టైటిల్ ఇప్పటికి రివీల్ చేయలేదు. డేట్లు మారుతున్నాయి కాని మహేష్ టైటిల్ పై మాత్రం ఓ క్లారిటీ రావట్లేదు. మార్చి 10న మహేష్ సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ అని గట్టిగానే వార్తలు వచ్చాయి. కచ్చితంగా ఈసారి మిస్ అయ్యే ఛాన్స్ లేదని అనుకున్నారు కాని తీరా చూస్తే మళ్లీ మహేష్ హ్యాండ్ ఇచ్చేశాడని అర్ధమైంది.

సినిమా టైటిల్ పట్ల చిత్రయూనిట్ కే ఓ క్లారిటీ రావట్లేదట.. చాలా రోజులుగా జనాల్లో నానుతున్న 'సంభవామి' టైటిల్ ఫైనల్ అనుకోగా రెండు మూడు రోజుల నుండి మళ్లీ పాత టైటిల్ అభిమన్యు వినబడుతుంది. మరి ఈ టైటిల్ కన్ ఫ్యూజన్ ఎప్పుడు తీరుతుందో చూడాలి. సంభవామి టైటిల్ అందరు ఓకే అనుకున్నా మహేష్ మాత్రం ఆ టైటిల్ పట్ల అసంతృప్తిగా ఉన్నాడట. ఉగాది కన్నా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేయాలని చూస్తున్న మహేష్ అండ్ మురుగదాస్ కనీసం అప్పుడైనా ఫ్యాన్స్ కు గిఫ్ట్ ఇస్తారో లేక ఇప్పటిలానే మళ్లీ నిరాశ పరుస్తారో చూడాలి.