
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ వాడుతున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రం. కాస్త కన్ ఫ్యూజింగ్ గా ఉంది కదా అసలు మ్యాటర్ ఏంటంటే కళ్యాణ్ ను పవన్ కళ్యాణ్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యేలా చేసిన మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. పవన్ నటించిన ఈ మొదటి సినిమా టైటిల్ ను ఇప్పుడు త్రివిక్రం వాడుకోవాలని అనుకుంటున్నాడట. అయితే ఈ టైటిల్ ను కాస్త చేంజ్ చేసి అంటే అక్కడబ్బాయి ఇక్కడమ్మాయి అని పెట్టి సినిమా చేస్తున్నారట.
నితిన్ హీరోగా కృష్ణ చైతన్య డైరక్షన్ లో వచ్చే సినిమాకు ఈ టైటిల్ పెడతారని టాక్. ఈ సినిమా నిర్మాతలు శ్రేష్ట్ మూవీస్ వారే అయినా.. సమర్పణ మాత్రం త్రివిక్రం పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. అంటే నిర్మాణంలో భాగమవుతున్న త్రివిక్రం పవర్ స్టార్ లు సినిమాకు అదనపు ఆకర్షణ వచ్చేందుకు అక్కడబ్బాయి ఇక్కడమ్మాయి టైటిల్ పెట్టబోతున్నారన్నమాట.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో కూడా ఓ సినిమా రాబోతుంది. మార్చ్ 14న సెట్స్ మీదకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ నటించిన కాటమరాయుడు మార్చ్ 24న రిలీజ్ చేయాలని చూస్తున్నారు.