చిరు, బాలయ్య టైటిల్స్ ఫిక్స్..!

ఒక్కసారిగా సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి నందమూరి యువరత్న బాలకృష్ణ తమ సినిమాలతో ఈతరం స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇద్దరు సంక్రాంతికి వచ్చి సూపర్ సక్సెస్ అందుకోగా వెంటనే తాము నటించబోయే తర్వాత సినిమాల గురించి ముందడుగు వేస్తున్నారు. చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ తో వస్తుండగా బాలయ్య పూరి జగన్నాథ్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.   

మెగాస్టార్ మూవీ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయబోతున్నాడట. ఇక ఈ సినిమా టైటిల్ గా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని పెట్టబోతున్నారట. పూరి తర్వాత కె.ఎస్.రవికుమార్ తో సినిమా చేయబోతున్నాడు బాలయ్య బాబు. ఈ సినిమా టైటిల్ గా జయసింహా అని పెట్టబోతున్నారట. 150 మొవీ సక్సెస్ తో చిరు.. 100వ సినిమా హిట్ తో బాలయ్య తమ సినిమాల అప్డేట్స్ తో మిగతా స్టార్స్ కు షాక్ ఇస్తున్నారు. రాబోతున్న ఈ సినిమాలు వారి సక్సెస్ మేనియాను కంటిన్యూ చేసేలా సూపర్ హిత్ అవ్వాలని ఆశిద్దాం.