పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ప్రారంభం.

పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు ప్రేమికుడిగా సరికొత్త అవతారం ఎత్తబోతున్నారు. ఆయన కథానాయకుడిగా నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. పవన్‌తో ‘ఖుషి’, ‘కొమరం పులి’ చిత్రాలు రూపొందించిన ఎస్‌.జె.సూర్య దర్శకుడు. శరత్‌ మరార్‌ నిర్మాత. ఈ చిత్రం బుధవారం ఉదయం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సుధాకర్‌రెడ్డి క్లాప్‌నిచ్చారు. ఎడిటర్‌ గౌతంరాజు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఎస్‌.జె. సూర్య గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఇదో ఫ్యాక్షనిస్టు ప్రేమకథ. నాలుగు నెలల నుంచి ఎస్‌.జె. సూర్య, రచయిత ఆకుల శివ కలసి కథపై కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు అందిస్తారు. రామ్‌లక్ష్మణ్‌ పోరాటాలను రూపొందించనున్నారు. జూన్‌లో చిత్రీకరణ మొదలెడతామ’’ని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రాన్ని ఈనెల 29న ప్రారంభించాలనుకున్నా కొన్ని కారణాల వల్ల ముందే మొదలెట్టారు.