టాలివుడ్ ప్రముఖులకు అంత సెక్స్ పిచ్చుందా?

తెలుగు సినీ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని అందరూ భుజాలు చరుచుకొంటుంటే, మరోవైపు దానికి అనేక మరకలు కనబడుతున్నాయి. సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టులు ఎటువంటి దుస్థితిని ఎదుర్కొంటున్నారో చిన్న నిర్మాతలు నటీనటులు కూడా ఇంచుమించు అటువంటి దుస్థితినే ఎదుర్కొంటున్నారు. దాసరి నారాయణ రావు, నత్తి కుమార్ వంటి వారు అనేక వేదికలపై ఈ విషయం బహిరంగంగా చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు ఉన్న మరో మరక బయటపడింది. కన్నడ హీరోయిన్ శృతి హరిహరన్ తెలుగు సినీ పరిశ్రమ గురించి చెప్పిన సంగతి వింటే, “మన తెలుగు సినీ ప్రముఖులకు మరీ ఇంత సెక్స్ పిచ్చి ఉందా?” అనే సందేహం కలుగక మానదు. 

ఆమె ఒక పత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “తెలుగు సినీ పరిశ్రమ అంటే నాకు చాలా భయం. దాని నుంచి వీలైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను. అక్కడ హీరోయిన్లు నిలద్రొక్కుకోవాలంటే తప్పనిసరిగా అక్కడి దర్శకుల, సినీ ప్రముఖుల లైంగిక వాంచలు తీర్చాల్సిందే. హీరోయిన్లు తమ మానం, అభిమానం, గౌరవం అన్నీ వదులుకోవడానికి సిద్దపడితేనే తెలుగు సినీ పరిశ్రమ వైపు వెళ్ళవచ్చు. దక్షిణాదిన అతిపెద్ద సినీ పరిశ్రమగా పేరొందిన తెలుగు సినిమాలలో చేయడం ఎవరికైనా గొప్ప విషయమే. కానీ దాని కోసం నా మానాభిమానాలను వదులుకోలేను. అందుకే తెలుగు సినీ పరిశ్రమవైపు కన్నెత్తి కూడా చూడదలచుకోలేదు. తమిళ సినీ పరిశ్రమలో పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. అక్కడ కూడా అటువంటివారున్నారు కానీ కొంచెం తక్కువ. అందుకే నేను ఎక్కువగా కన్నడ సినిమలాకే పరిమితం అయ్యాను,” అని శృతి హరిహరన్ అన్నారు.              

ఆమె చేసిన ఈ ఆరోపణలకు తెలుగు సినీ ప్రముఖులు ఏమని సమాధానం చెపుతారో..అసలు స్పందిస్తారో లేదో..చూడాలి.