విజయ్..సూర్య.. చెర్రి మల్టీస్టారర్..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ ధ్రువ తర్వాత ప్రస్తుతం సుకుమార్ డైరక్షన్ లో మూవీ చేయబోతున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత మణిరత్నం డైరక్షన్ లో మూవీ కూడా దాదాపు కన్ఫాం అంటున్నారట. ఈ సినిమా ఓ భారీ మల్టీస్టారర్ అవుతుందని అంటున్నారు. సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరోలు విజయ్, సూర్యలు కూడా ఈ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

మణిరత్నం డైరక్షన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమా గురించి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ ఉగాది రోజు రివీల్ చేస్తారట. మణిరత్నం డైరక్షన్ లో వచ్చిన దళపతి రేంజ్ లో ఈ సినిమా అందరి హీరోలకు సరైన పాత్రలు పడే అవకాశాలు ఉన్నాయట. ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయితే కనుక తెలుగు తమిళ హీరోలు చేస్తున్న అతి పెద్ద మల్టీస్టారర్ ఇదే అవుతుందని చెప్పొచ్చు.