
కుమారి సినిమాతో కుర్ర కారు కలల రాకుమారిగా మారిన హెబ్బా పటేల్ ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తన అందంతో మత్తులు చల్లేస్తున్న ఈ అమ్మడు అందాలనే ఎరగా వేసుకుని సినిమాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం హెబ్బా పటేల్ నటిస్తున్న సినిమా ఏంజెల్. వినవయ్య రామయ్య ఫేం నాగ్ అన్వేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హెబ్బా అందాలనే హైలెట్ అయ్యేలా చూస్తున్నారట.
రీసెంట్ గా రిలీజ్ అయిన ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న నేను నా బోయ్ ఫ్రెండ్స్ సినిమాతో సక్సెస్ అందుకున్న హెబ్బా తన అందంతో సినిమాల సక్సెస్ అందుకుంటుంది. ప్రస్తుతం మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా మిస్టర్ సినిమాలో నటిస్తున్న హెబ్బా అందులో కూడా తన మార్క్ గ్లామరసం పండిస్తుందని అంటున్నారు. మొత్తానికి అలా ఎలా సినిమాతో పరిచయమైన హెబ్బా అనతి కాలంలోనే యువత మనసు దోచేసిందని చెప్పొచ్చు. స్టార్ ఇమేజ్ సంపాదించకపోయినా కుర్ర హీరోలకు హెబ్బా పర్ఫెక్ట్ మ్యాచ్ అని తెలిసిందే. మరి హెబ్బా మీద ఆశలతో వస్తున్న ఈ ఏంజెల్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.