రారండోయ్.. 'అఖిల్' వేడుక చూద్దాం..!

అక్కినేని అఖిల్ రెండో సినిమాకు రంగం సిద్ధమైంది.. విక్రం కుమార్ డైరక్షన్ లో సినిమా స్టార్ట్ చేసిన అఖిల్ ఆ సినిమా టైటిల్ గా 'రారండోయ్ వేడుక చూద్దాం' అని పెట్టబోతున్నారట. అన్నపూర్ణ బ్యానర్లో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ ను రిజిస్టర్ చేయించారట. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న నాగ చైతన్య కళ్యాణ్ కృష్ణ టైటిల్ కాని అఖిల్ సినిమా టైటిల్ కాని ఇదే అయ్యి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.   

అఖిల్ మూవీ తర్వాత ఏడాదిన్నర వెయిట్ చేసిన అఖిల్ చివరగా విక్రం కె కుమార్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. అఖిల్ ఎనర్జీకి సరిపోయే కథతో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. మొదటి సినిమా అంచనాలను అందుకోలేకపోయిన అఖిల్ ఈ సెకండ్ మూవీ కచ్చితంగా హిట్ టార్గెట్ తో వస్తున్నాడు. ఇక మరో పక్క చైతు ప్రేమం, సాహసం శ్వాసగా సాగిపో తర్వాత కళ్యాణ్ కృష్ణతో సినిమా చేస్తుండగా తర్వాత సినిమా త్రివిక్రంతో ఉంటుందని అంటున్నారు.