లాగే.. లాగే.. సాంగ్ తో మనసు లాగేసినా పవర్ స్టార్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న కాటమరాయుడు సినిమా నుండి సెకండ్ సాంగ్ కొద్దిగంటల క్రితం రిలీజ్ అయ్యింది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో రీసెంట్ గా రిలీజ్ అయిన మిరా మిరా మీసం సాంగ్ యూట్యూబ్ లో సంచలనాలను సృష్టించింది. దాదాపు కోటికి దగ్గరగా వ్యూయర్ షిప్ సాధించిన ఈ సాంగ్ పవర్ స్టార్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది.                

ఇక అదే క్రమంలో సెకండ్ సాంగ్ లాగే లాగే మనస్సు లాగే నీవైపే సాంగ్ కూడా అనూప్ రూబెన్స్ మార్క్ మెలోడి ట్యూన్ తో వచ్చింది. హీరోయిన్ ను బుట్టలో వేసే క్రమంలో వచ్చే సాంగ్ లా అనిపిస్తున్న ఈ సాంగ్ కూడా పవర్ స్టార్ ఇమేజ్ కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. టీజర్ తో అంచనాలను పెంచి మిరా మిరా మీసం సాంగ్ తో ఇంకాస్త క్రేజ్ సంపాదించిన కాటమరాయుడు ఈరోజు రిలీజ్ అయిన మనస్సు లీగే సాంగ్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ మనసు లాగేయడం కన్ఫాం.