
చందమామ కథలు, గుంటూర్ టాకీస్ సినిమాలను డైరెక్ట్ చేసిన ప్రవీణ్ సత్తారు ప్రస్తుతం రాజశేఖర్ హీరోగా గరుడవేగ సినిమా చేస్తున్నాడు. మూవీలో హీరోయిన్ గా పూజా కుమార్ నటిస్తుండగా సన్ని లియోన్ తో ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో సన్ని స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందట.. ఐటం సాంగ్ ఆలోచన రాగానే ప్రేక్షకులకు బాగా తెలిసిన అమ్మాయి బాగుంటుందని సన్నిని సెలెక్ట్ చేశారట.
ఈ పాటలో సన్ని సెక్సీగా కనిపించనుందట. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెంట్ గా రాజశేఖర్ కనిపించనున్న ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ సినిమా మీద అంచనాలను పెంచేసింది. గుంటూర్ టాకీస్ తర్వాత ప్రవీణ్ సత్తారు ఈ మూవీతో రావడం అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది. తెలుగులో ఈ పాట చేసేందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపించినా సరే సన్ని లియోన్ తోనే చేయాలని ఆమెను సెలెక్ట్ చేశారట.
సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ సాంగ్ సినిమాకు చాలా ప్లస్ అవుతుందని.. ఇదో ఐటం సాంగ్ లా కాకుండా సినిమాకు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కిస్తున్నామని అన్నారు. కేరళలో షూట్ చేయనున్న ఈ సాంగ్ ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నారు ప్రవీణ్ సత్తారు. సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు చిత్రయూనిట్.