
నందమూరి బాలకృష్ణ 101వ సినిమా షురూ చేశాడు. పూరి జగన్నాథ్ డైరక్షన్ లో తన సినిమా ముహుర్త కార్యక్రమాలను చేసుకున్నారు బాలకృష్ణ. రీసెంట్ గా వార్తల్లోకి వచ్చిన ఈ క్రేజీ కాంబినేషన్ సినిమా చేస్తుండటం గొప్ప విషయం. నేడు ప్రారంభమైన ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది మాత్రం ఇంకా ఫైనల్ కాలేదట. ముగ్గురు హీరోయిన్స్ అవసరమున్న ఈ సినిమాలో కుదిరితే కాజల్ లేదా నయనతారని తీసుకుందామని చూస్తున్నారట.
కాజల్ తమిళంలో అవకాశాలున్నాయని తప్పించుకోగా.. నయన్ సినిమా అంటే 3.5 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. అంత ఇచ్చుకోలేమని నయనతారను స్కిప్ చేశారు. లీడింగ్ హీరోయిన్స్ లో తమన్నా ఒక్కతే కాస్త తగిన రెమ్యునరేషన్ లో వచ్చేలా కనబడుతుంది. తమన్నాను కూడా ఓ హీరోయిన్ గా సెలెక్ట్ చేసిన పూరి మిగతా ఇద్దరి కోసం సంప్రదింపులు జరుపుతున్నాడట. ఈరోజు స్టార్ట్ అయిన ఈ సినిమా సెప్టెంబర్ 29 కల్లా రిలీజ్ చేస్తానని ఎనౌస్న్ చేశాడు పూరి జగన్నాధ్.