మళ్లీ ఒంటరైన నయన్..?

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార మళ్లీ ఒంటరైందా..? రెండేళ్లుగా విఘ్నేష్ శివన్ తో సహజీవనం చేస్తున్న అమ్మడు అతనికి బ్రేకప్ చెప్పేసిందా..? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. మొదట్లో శింభు ఆ తర్వాత ప్రభుదేవాతో ప్రేమాయణం కొనసాగించిన నయనతార ప్రస్తుతం విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉంది. ఎక్కడికెళ్లినా అమ్మడు అతనితోనే వెంట పెట్టుకెళ్లడం చూసి వీరి ప్రేమ చాలా స్ట్రాంగ్ అనుకున్నారు.


కాని ఇంతలోనే ఇద్దరు మళ్లీ బ్రేకప్ చెప్పేసుకున్నారట. ఇన్నాళ్లు విఘ్నేష్ శివన్ తోనే కలిసి ఉంటున్న నయనతార ఇప్పుడు చెన్నైలో ఓ స్టార్ హోటెల్ కు షిఫ్ట్ అయ్యిందట. వరుసగా సినిమా ఛాన్సులు రావడంతో విఘ్నేష్ తో వ్యవహారం కూడా దెబ్బకొట్టిందని అంటున్నారు. నయన్ కు లవ్ బ్రేకప్ అలవాటుగా మారింది.. శింభు, ప్రభుదేవ దారిలోనే తాజాగా విఘ్నేష్ శివన్ కు సారీ అని చెప్పేసిందట. మరి ఈ వార్తల్లో నిజం ఎంత అన్నది తెలియదు కాని కోలీవుడ్ మీడియా మాత్రం నయన్ మీద హాట్ న్యూస్ ప్రసారం చేస్తున్నాయి.