చిరు కోరిక మురుగదాస్ తీరుస్తాడా..?

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైది నంబర్ 150 రికార్డులు సృష్టించగా ఆ సినిమా తర్వాత ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ తో చిరు తన 151వ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రాకపోయినా డైరక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడని అంటున్నారు. 150వ సినిమా కథల విషయంలో చిరు ఎంత కన్ ఫ్యూజ్ అయ్యాడో తెలిసిందే. ఎలాంటి సినిమాతో వస్తే తనని మళ్లీ అభిమానులు రిసీవ్ చేసుకుంటారో అని పెద్ద పోరాటమే చేశాడు.   

ఫైనల్ గా ఖైదితో రావడం అనుకున్న రేంజ్ కంటే సూపర్ హిట్ కొట్టడం చూశాం.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ తర్వాత చిరు తన ఇమేజ్ కు సరితూగే కథని రెడీ చేయమన్నట్టు తమిళ దర్శకుడు మురుగదాస్ కు చెప్పినట్టు టాక్. రీసెంట్ గా మహేష్ మురుగదాస్ సినిమా సెట్స్ కు వెళ్లిన మెగాస్టార్ మహేష్ తో కాసేపు ముచ్చట్లు పెట్టాడట. ఇక డైరక్టర్ మురుగదాస్ కు సరైన కథ ఉంటే చెప్పమని అన్నాడట. మహేష్ సినిమా తర్వాత బాలీవుడ్ మూవీ చేసే ఆలోచనలో ఉన్న మురుగదాస్ చిరంజీవి కోసం కథ అందిస్తాడో లేదో చూడాలి.