
మలయాళం నుండి వచ్చి తెలుగులో చేసిన రెండు సినిమాలకే స్టార్ హీరోయిన్ ఇమేజ్ సంపాదించిన కీర్తి సురేష్ ఇప్పుడు కన్ ఫ్యూజన్ లో ఉందని తెలుస్తుంది. ఇంతకీ అమ్మడి కన్ ఫ్యూజన్ అంతా దేనికి అంటే ఒకేసారి రెండు భారీ ప్రాజెక్టులు తన చేతికి రావడంతో అమ్మడు ఏది ఫైనల్ చేయాలో తోచట్లేదట. నేను శైలజ హిట్ తో పాటు రీసెంట్ గా నేను లోకల్ కూడా సూపర్ హిట్ అవడంతో కీర్తి సురేష్ అంటే చాలు దర్శక నిర్మాతలు ఎగబడుతున్నారు.
ఇదే టైంలో త్రివిక్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో సెలెక్ట్ అయిన కీర్తి అదే క్రమంలో సావిత్రి బయోపిక్ గా నాగ్ అశ్విన్ సినిమాలో కూడా ఆమెనే ఫైనల్ చేశారు. ఈ రెండు సినిమాలు చేస్తే కీర్తి కచ్చితంగా స్టార్ హీరోయిన్ అయినట్టే. కాని ఒక సినిమాకు సైన్ చేస్తే మరో సినిమాను మిస్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఈ సమయంలో కీర్తి సురేష్ కాస్త కన్ ఫ్యూజన్ లో ఉందని అంటున్నారు. ఊహించని రేంజ్లో తెలుగు తమిళ భాషల్లో క్రేజ్ సంపాదించిన కీర్తి సురేష్ వరుసగా వచ్చిన అవకాశాల్లో ఏది ఓకే చెప్పాలో తెలియక కంగారు పడుతుందట.