ఆ గదిలో దెయ్యం సమంతనా..!

ఓంకార్ డైరక్షన్ లో రాజు గారి గది సీక్వల్ గా వస్తున్న సినిమా రాజు గారి గది-2. నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సమంత కూడా లీడ్ రోల్ చేస్తుందట. అయితే నాగ్ హీరో సమంత హీరోయిన్ కాంబినేషన్ కుదరనిది.. సీరత్ కపూర్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో సమంత దెయ్యం పాత్రలో నటిస్తుందని తెలుస్తుంది. రీసెంట్ గా రాజు గారి గది-2లో సమంత పిక్ ఒకటి షేర్ చేసింది.  

వెరైటీగా ఉన్న ఆ పిక్ చూస్తుంటే కచ్చితంగా సమంత సినిమాలో దెయ్యం పాత్ర వేస్తున్నట్టు చెప్పేయొచ్చు. స్టార్ హీరోయిన్ గా క్రేజీ సినిమాలు చేసిన సమంత త్వరలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది సమంత. సాధారణంగా ఇలాంటి హర్రర్ సినిమాలో దెయ్యం పాత్ర అసలు రివీల్ చేయరు కాని వెరైటీగా తన పాత్ర రివీల్ చేసి అందరికి షాక్ ఇచ్చింది సమంత. ఇది ఓ రకంగా సినిమా మీద అంచనాలను పెంచేందుకే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు.