
సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా టైటిల్ మరో రెండు రోజుల్లో ఎనౌన్స్ చేయనున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా జూన్ 23న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక సినిమా షూటింగ్ పూర్తి కాగానే మహేష్ కొరటాల శివతో సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ముహుర్త కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే నెలలో సెట్స్ మీదకు వెళ్తుందట.
భరత్ అనే నేను టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో మహేష్ కు జోడిగా కొత్త హీరోయిన్ ను తెస్తున్నారట. సౌత్ లో ఆల్మోస్ట్ అందరితో రొమాన్స్ చేసిన మహేష్ బాలీవుడ్ భామల కన్నా కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని భావిస్తున్నాడట. కొరటాల శివ కూడా కొత్త హీరోయిన్ అయితే లుక్స్ వైజ్ బాగుంటుందని ఆలోచనలో ఉన్నాడట. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరికో తెలియదు కాని ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్ కోసం వేట మొదలైందట.
అయితే మహేష్ కొత్త హీరోయిన్ తో చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అయ్యింది.. ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన 1 నేనొక్కడినే ఫ్లాప్ అయ్యాక కూడా మహేష్ ఇలాంటి సాహసోపేత నిర్ణయం తెసుకోవడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. కొరటాల శివ స్క్రిప్ట్ మీద ఎంత నమ్మకం ఉన్నా మహేష్ తన బ్యాడ్ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.