గుండె అదిరేలా బాహుబలి-2 ట్రైలర్..!

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ది బిగినింగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. తెలుగు సినిమా స్థాయిని పెంచేసిన బాహుబలి ఇప్పుడు సెకండ్ పార్ట్ రిలీజ్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతున్న బాహుబలి-2 ట్రైలర్ మార్చ్ 15న రిలీజ్ చేస్తున్నారట. ఇక ఈ ట్రైలర్ చూసిన కీరవాణి తమ్ముడు కళ్యాణ్ రమణి ట్రైలర్ చూసి గుండెలదరాయని.. సినిమాతో సంబంధం లేకుండా ఈ ట్రైలరే మరో 100 రోజులు ఆడుతుందని అన్నాడు.

కళ్యాణ్ రమణి ట్వీట్ తో బాహుబలి-2 ట్రైలర్ మీద మరింత అంచనాలు పెరిగాయి. కేవలం సౌత్ సినిమానే కాదు బాహుబలి-2 కోసం బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ తోనే సినిమా రుచి చూపిస్తున్న జక్కన్న మళ్లీ పార్ట్-2 తో రికార్డులు షురూ చేయడం కన్ఫాం అని అంటున్నారు. మొదటి పార్ట్ లో అనుష్కని ఓల్డ్ గెటప్ లో చూపించిన రాజమౌళి పార్ట్-2 లో దేవసేన అందాలను కూడా అందించనున్నాడు. మార్చ్ 15న బాహుబలి సంచలనం స్టార్ట్ అవుతున్నట్టే. మరి సినిమా ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.