పవర్ స్టార్ కు బాలీవుడ్ పబ్లిసిటీ..!

సౌత్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉండే ఫాలోయింగ్ ఏంటో తెలిసిందే.. ప్రస్తుతం కాటమరాయుడు మూవీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆ సినిమా కోసం బాలీవుడ్ పబ్లిసిటీ మీడియాను వాడుతున్నారట. వెబ్ జియర్ అనే ముంబై మీడియా కాటమరాయుడు ప్రమోషన్స్ చేయనుందట. బాలీవుడ్ లో స్టార్స్ సినిమాలను పబ్లిసిటీ చేసే ఈ మీడియా ఇప్పుడు పవర్ స్టార్ సినిమాకు పనిచేస్తుంది.

ముందు కాటమరాయుడు డీల్ వద్దన్నట్టు చెప్పగా టీజర్ తో యూ ట్యూబ్ లో వచ్చిన వ్యూయర్ కౌంట్ చూసి వారు ఓకే అన్నారట. మరి పవర్ స్టామినా తక్కువంచనా వేశారో ఏమో కాని ప్రస్తుతం కాటమరాయుడు మాత్రం వెబ్ జియర్ చేతిలోకి వెళ్లింది. అంతేకాదు సినిమా నిర్మాత శరత్ మరార్ ఈ సినిమా ప్రమోషన్స్ ను దగ్గరుండి చూసుకుంటున్నారట. టీజర్, సాంగ్స్ తో సూపర్ క్రేజ్ దక్కించుకున్న కాటమరాయుడు సినిమా కూడా అదే రేంజ్ హిట్ అవుతుందని నమ్ముతున్నారు.