
క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ కొత్తగా బిజినెస్ రంగంలోకి దిగుతున్నారు. డైరక్టర్ గా కోట్లు సంపాదిస్తున్న సుకుమార్ ఇప్పుడు తన బిజినెస్ లో కూడా తన స్పెషాలిటీ చూపించాలని చూస్తున్నాడు. ఇంతకీ సుక్కు స్టార్ట్ చేసే బిజినెస్ ఏంటి అంటే డ్రై క్లీనింగ్ బిజినెస్ అట. వినడానికి కాస్త కొత్తగా ఉన్నా అందులో లాభాలు ఘడించాలని చూస్తున్నాడు సుకుమార్. రైల్వేస్టేషన్, బస్ టాప్స్, హోటెల్స్ లలో డ్రై క్లీనింగ్ కాంట్రాక్ట్ మాట్లాడుకునే ఆలోచనలో ఉన్నాడట.
తన ఫ్యామిలీ మొత్తం ఈ బిజినెస్ లో ఇన్వావ్ అవుతుందట. లాస్ట్ ఇయర్ నాన్నకు ప్రేమతో సినిమాతో పర్వాలేదనిపించుకున్న సుకుమార్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా ముహుర్త కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా మార్చ్ 20 నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్తుంది. సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తారని తెలుస్తుంది. పల్లెటూరి ప్రేమకథగా రాబోతున్న ఈ సినిమాలో చరణ్ లుక్ కొత్తగా ఉంటుందట.