ఆశలన్ని 'నగరం' మీదనే..!

కుర్ర హీరోల్లో ఈమధ్య సందీప్ కిషన్ జోష్ తగ్గినట్టే కనిపిస్తుంది. అప్పట్లో క్రేజీ సినిమాలను తీస్తూ తెలుగు తమిళ భాషాల్లో క్రేజ్ సంపాదించిన సందీప్ వరుస ఫ్లాపులతో ఢీలా పడ్డాడు. ప్రస్తుతం సందీప్ కిషన్ తమిళంలో నటించిన 'మానగరం' తెలుగులో 'నగరం'గా రిలీజ్ అవుతుంది. మార్చ్ 10న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను తమిళ్ వర్షన్ స్పెషల్ స్క్రీనింగ్ వేశారు.  

సినిమా చూసిన కోలీవుడ్ సెలబ్రిటీస్ సందీప్ ను తెగ పొగిడేస్తున్నారు. ఇక సేం టైంలో తెలుగు ట్రైలర్ కూడా రిలీజ్ చేశాడు సందీప్ కిషన్. తన సినిమాకు బాగుంది అన్న టాక్ విన్న సందీప్ సినిమాను ప్రమోట్ చేయడం మొదలుపెట్టాడు. సినిమా ప్రీమియర్ లో సెలబ్రిటీస్ చేసిన ప్రతి ఒక్క ట్వీట్ రీ ట్వీట్ చేసి మరి ప్రమోషన్ చేస్తున్నాడు. తమిళంలో మంచి రిజల్ట్ వస్తే తెలుగులో కూడా అంతకంటే ఎక్కువ హిట్ అవుతుందని సందీప్ అంచనా వేస్తున్నాడు.

మరి నగరం సినిమా సందీప్ కిషన్ ఆశలను నెరవేరుస్తుందో లేదో చూడాలి. ఇక ఇదే కాకుండా సందీప్ కిషన్ కృష్ణవంశీ డైరక్షన్ లో నక్షత్రం సినిమా చేస్తున్నాడు. నగరంలో పెయిర్ గా నటించిన సందీప్ కిషన్ రెజినాలే ఈ సినిమాలో కూడా నటిస్తుండటం విశేషం.