మెగా పవర్ స్టార్ రాం చరణ్ క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రీసెంట్ గా ముహుర్తం జరుపుకుంది. పల్లెటూరి ప్రేమకథగా రాబోతున్న ఈ సినిమాలో ముందు హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను అనుకున్నారు. ఆ తర్వాత కారణాలు ఏవో తెలియదు కాని ఆ హీరోయిన్ ను తప్పించి సమంతను ఓకే చేశారు. అయితే ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీలో జరుగుతున్న వివాదాల కారణంగా సమంత చెర్రితో సినిమా చేసే అవకాశం లేదని అన్నారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా మార్చ్ 20న షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే సినిమాలో ఫైనల్ హీరోయిన్ గా సమంత ఓకే అయ్యిందట. మార్చ్ 22 నుండి సమంత కూడా షూట్లో పాల్గొంటుందని తెలుస్తుంది. ప్రొఫెషన్ ను ప్రాణంగా ప్రేమించే సమంత ఇచ్చిన మాట ప్రకారం హీరోయిన్ గా ఛాన్స్ వస్తే మాత్రం వదులుకునే ప్రసక్తే లేదని మరోసారి ప్రూవ్ చేసింది. క్రేజీ కాంబినేషన్ గా రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.