
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న దువ్వాడ జగన్నాథం మూవీ పూర్తి కాగానే వక్కంతం వంశీ డైరక్షన్ లో సినిమా షురూ చేస్తున్నాడు. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాను రామకృష్ణ సిని క్రియేషన్స్ లో లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్నారు.
సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ కియరా అద్వానిని తీసుకుంటున్నారట. ఎమ్మెస్ ధోని అన్ టోల్డ్ స్టోరీలో హీరోయిన్ గా నటించిన ఈ అమ్మడు మంచి అభినయంతో ఆకట్టుకుంది. సౌత్ స్టార్ హీరోయిన్స్ అందరితో జతకట్టిన బన్ని ఈసారి బాలీవుడ్ భామలపై కన్నేశాడు. ప్రస్తుతం చిత్రయూనిట్ కియరాతో చర్చలు జరుపుతున్నారట. ఒకవేళ ఆమె మిస్ అయితే దిశా పటానిని అయినా సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం డిజెలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది.