
సౌత్ క్రేజీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సినిమా కెరియర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. దశాబ్ధ కాలాంగా తన అందం అభినయంతో అదరగొడుతున్న అమ్మడు ఇప్పటికి స్టార్ రేంజ్ లో ఉందంటే అమ్మడి టాలెంట్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. స్టార్ హీరోలందరితో కలిసి నటించిన కాజల్ లవ్ లో పడ్డదని అంటున్నారు. ఇంతకీ అమ్మడు లవ్ లో పడింది ఎవరితో అంటే ఓ బడా బిజినెస్ మ్యాన్ తో అని తెలుస్తుంది.
దేశవ్యాప్తంగా హోటెల్స్ ఉన్న బిజినెస్ మ్యాన్ తో కాజల్ ప్రేమాయణం కొనసాగిస్తుందట. కొద్దిరోజులుగా ఈ ప్రేమజంట డేటింగ్ లో కూడా ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం తను కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసుకుని అతన్ని పెళ్లి చేసుకోవాలని చూస్తుంది కాజల్. రెండు మూడేళ్ల క్రితం కాజల్ కెరియర్ ముంగింపు దశకు వచ్చినట్టే కనబడినా అనూహ్యంగా మళ్లీ సూపర్ సక్సెస్ లతో ఫాంలోకి వచ్చింది. రీసెంట్ గా జనతా గ్యారేజ్ లో పక్కా లోకల్ సాంగ్ తో ఐటం గా కూడా అమ్మడు అదరగొట్టింది.