
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క హీరోగా చేస్తూనే మరో పక్క పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో సినిమాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రంతో కలిసి నితిన్ హీరోగా సినిమా చేస్తున్న పవర్ స్టార్, ఇప్పుడు మేనళ్లుడు సాయి ధరం తేజ్ ను ప్రొడ్యూస్ చేయబోతున్నాడట.
మెగా మేనళ్లుడిగా అతి తక్కువ కాలంలోనే మెగా ఫ్యాన్స్ అభిమానం పొంది మాస్ ఇమేజ్ సంపాదించిన తేజ్ సుప్రీం హీరో అన్న స్క్రీన్ నేం కూడా సంపాదించాడు. తన సినిమాల ప్రమోషన్స్ లో కూడా మేనమామల మీద ఇష్టాన్ని చూపించే తేజ్ ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ నిర్మాణంలో నటించడం ఈ ప్రాజెక్ట్ కే సూపర్ క్రేజ్ తెచ్చింది. ఈ సినిమా దర్శకుడు ఎవరు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది త్వరలో తెలుస్తుంది.